Trending Now

ఆ ముగ్గురు నేతల భాషను చూసి అసహ్యించుకుంటున్న జనాలు

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ నేత ఈటెల రాజేందర్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఈ ముగ్గురు నేతలు మాట్లాడుతున్న భాషను చూసి జనాలు అసహ్యించుకుంటున్నారని.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ పది ఏండ్లలో రాష్ట్రాన్ని దివాళా తీయించారని.. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే జనాలు మిమ్మల్ని ఎందుకు ఓడించారు. మా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రాడ్యూవేట్ ఎన్నికల్లో నాలుగు ఓట్లు కోసం రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. హుజూరాబాద్, మల్కాజ్ గిరి లో ఓడిపోతున్నాడని తెలిసి ఈటెల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈటెల రాజేందర్ ఆఫ్ట్రాల్ గాడని ఆయన మండిపడ్డారు. నిర్మాణ రంగంలో బీజేపీ నాయకులు ఎక్కువగా ఉన్నారు.. మీ నాయకులను అడుగు మేము ఎవరి దగ్గరైనా స్కేర్ కు పైసలు తీసుకున్నమా అడుగు.. మేము ఎవరి దగ్గరైన పైసలు తీసుకున్నామని నిరూపిస్తే దేనికైనా మేము రెడీ అని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి కి ఈటెల రాజేందర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News