Trending Now

కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇస్తే ‘పవర్ కట్’ అయ్యింది..

ప్రతిపక్షం, ఎల్బీనగర్ ఏప్రిల్ 12: మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఎల్.బి.నగర్ నియోజకవర్గ డివిజన్ల వారిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో లింగోజిగూడా డివిజన్ పరిధిలోని కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గరపు దాయనంద్, మల్కాజిగిరి బీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇస్తే ‘పవర్ కట్’ అయ్యిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది నీటి, కరెంటు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు. ప్రస్తుతం జలాశయాలు ఎండిపోవడం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాబోయే రోజుల్లో నీటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ప్రజలకు రానున్నది అన్నారు.

ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేయడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారని తెలిపారు. ప్రస్తుతం మల్కాజిగిరి పార్లమెంటు బరిలో ఉన్న ఇతర పార్టీల నాయకులు బయటివారని తెలిపారు. స్థానికులు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి అయిన రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలమైన పార్టీగా ఎదుగుతుంది అని అన్నారు.

పార్టీ మారే వారి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త తామే అభ్యర్థి అని అనుకోని ఇంటి, ఇంటి ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజ్జెల మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, పద్మ శ్రీనివాస్ నాయక్, డివిజన్ల అధ్యక్షులు అందోజు సత్యం చారి, వరప్రసాద్ రెడ్డి, రాజీరెడ్డి, సయ్యద్ పాషా, సుంకోజు కృష్ణమాచారి, పల్లం శ్రీనివాస్, బిక్షపతి ముదిరాజ్, సెల్వా చారి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News