Trending Now

పార్టీ మారే ఉద్దేశం లేదు : ‌‌మాజీ మంత్రి ఎర్రబెల్లి

ప్రతిపక్షం, వరంగల్: నాకు ఫోన్​ ట్యాపింగ్​ ఎంటిదో తెల్వదు.. ప్రణీత్​రావు ఎవరో కూడా తెలియదు.. ఆయన అమ్మమ్మ ఊరు పర్వతగిరి.. నా పేరు చెప్పాలంటూ ఒత్తిడి తెస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, బిజినెస్, భూదందాళు, తప్పుడు పనులు చేసే వారు పార్టీలు మారుతున్నారంటూ ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పెట్టే అక్రమ కేసుల నుంచి తప్పించుకునేందుకు తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ప్రచారానాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానన్న ఎర్రబెల్లి.. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పెట్టినా పార్టీ మారలేదని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ‘‘నాకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదు. నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. వైఎస్ఆర్ ఎన్నో ఇబ్బందులు పెట్టినా పార్టీ మారలేదు. చాలా మంది నాయకులు పార్టీ వీడి పోతున్నారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసేవారు అధికార పార్టీలోకి పోతున్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు. ఎన్నికల కోసమే డ్రామా చేశారు. కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా అమలు చేయడం లేదు. మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటు. నీళ్లు లేవు, పంటలు ఎండిపోతున్నాయి. మండే వేసవిలో కూడా చెరువులు నింపిన మహానుభావుడు కేసీఆర్. కార్యకర్తలు దైర్యంగా ఉండండి, నాయకులు పోయినంత మాత్రాన ఏమి కాదు. కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెడితే మేము పోలీస్ స్టేషన్‌లో కూర్చుంటాం. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాం. గెలుపు, ఓటములు సహజం. ఎన్టీఆర్ లాంటి నాయకునికి కూడా ఓటమి తప్పలేదు.’’ అని అన్నారు.

Spread the love

Related News

Latest News