కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి సిద్ధరామయ్యకు చోటు

ప్రతిపక్షం, జూన్ 03: కర్ణాటకలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను సభ్యుడిగా నియమించింది.

ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, కర్ణాటకలో కొత్త మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. రేపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు సుమారు 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

Spread the love

Related News

Latest News