Trending Now

ప్రజా సమస్యల పరిష్కారం.. అభివృద్దే చెరుకు శ్రీనివాస్ రెడ్డి లక్ష్యం

ప్రతి పక్షం, దుబ్బాక, ఏప్రిల్23: ప్రజా సమస్యల పరిష్కారం.. అభివృద్దే చెరుకు శ్రీనివాస్ రెడ్డి లక్ష్యం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మంగళ వారం దుబ్బాక మండల పరిధిలోని సీఎస్‌ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి నిత్యం కృషి చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ భారీ మెజారీటీతో గెలువబోతున్నారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఇప్పటికే ఐదు గ్యారంటీలను వంద రోజుల లోపే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు.

ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ, పంట బోనస్ ఐదు వందల రూపాయలు, అమలు జరుకుతాయని వారు పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్, దుబ్బాక పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏసురెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి, ఉపాధ్యక్షులు కడు దూరి నరేందర్ రెడ్డి, పీఎసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల దేవేందర్, నాయకులు మల్లు గారి రామచంద్ర రెడ్డి, ఐరేని సాయి తేజ గౌడ్, ఆదారి వెంకటి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News