ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 03: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని విశ్వ బ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 9 వ తేదీ వరకు శ్రీ కాళికాదేవి ఆలయంలో నిర్వహించనున్న కాళికాదేవి బోనాల మహోత్సవానికి మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ ను సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మహోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆహ్వానాన్ని స్వీకరించిన దొంతి నరేష్ గౌడ్ మహోత్సవాల విజయవంతానికి తన సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ఏలేశ్వర్ బ్రహ్మచారి, కమిటీ సభ్యులు, సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

















