Trending Now

ఖేలో క్రీడాకారులకు ప్రభుత్వ కొలువులు..

ప్రతిపక్షం, ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాలకు ఖేలో ఇండియా క్రీడాకారులు ఇకపై అర్హులని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. యువజన, విశ్వవిద్యాలయాల,పారా, శీతాకాల ఖేలో ఇండియా క్రీడల్లో పతకాలు సాధించినవారు ఈ ఉద్యోగాలు పొందేందుకు అర్హులని ఆయన సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు.అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు, క్రీడలు లాభదాయకం,ఎదుగుదలకు ఉపకరించే వృత్తిగా దోహదపడేందుకు నిబంధనలు మార్చినట్లు మంత్రి వివరించారు.

Spread the love