[t4b-ticker]

ప్రజాధనంతో కార్పోరేటర్లకు ఫోన్లు

  • 65 మందికి రూ. 2.68 కోట్లు దుర్వినియోగం
  • ఫోన్లు కొనివ్వడం సిగ్గుచేటు
  • సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం

ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, సెప్టెంబర్ 14: ప్రజలు ఇంటి పన్ను, నల్ల పన్ను,చెత్త పన్ను ఇలాంటి వివిధ పన్నుల ద్వారా చెల్లించిన డబ్బుల నుండి 66 మంది కార్పోరేటర్లకు, కో ఆప్షన్ సభ్యులకు సుమారు రూ 40,000
చొప్పిన సుమారు రూ. 2.68 కోట్లు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కార్పొరేటర్లకు ఫోన్లు కొనివ్వడం సిగ్గుచేటని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. గతంలో ఫోన్ల కోసం టెండర్లు వేయగా సిపిఎం ఆధ్వర్యంలో టెండర్లు రద్దు చేయాలని ఆందోళన చేసినప్పటికీ కార్పొరేటర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సెల్ ఫోన్లు కొనుగోలు చేయడం అత్యంత విచారకరం అన్నారు.ప్రజలు వివిధ రూపాయలలో చెల్లించిన పన్నులను మున్సిపల్ అభివృద్ధికి, రోడ్లు డ్రైనేజీ ప్రజల సౌకర్యానికి వినియోగించవలసింది పోయి కార్పోరేటర్లు ఫోన్లు కొనుగోలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

ఇన్నోవా కార్లలో తిరిగే కార్పొరేటర్లకు మొబైల్ కొనుగోలు చేసుకోవడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు.ప్రజల సౌకర్యం కోసమే ఫోన్ ద్వారా సమాచారం తీసుకుంటున్నాం అని కళ్లి బొల్లి మాటలు చెబుతున్నారని, ప్రజల సమస్యలు విన్నవించేందుకు ప్రజావాణి కార్యక్రమం ఉందని, ఫోన్ ఇన్ కార్యక్రమం కూడా ఉందని వాటి ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరించకుండా ప్రజల ధనంతో సెల్ ఫోన్లు కొనివ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. అవసరం అనుకుంటే సిమ్ కార్డులు కొనిస్తే కార్పొరేటర్లకు ఫోన్ కొనుగోలు చేసే శక్తి ఉందని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికైనా కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు సెల్ఫోన్లను వాపస్ ఇచ్చి ప్రజలకు సమాధానంగా ఉండాలని అన్నారు.

Spread the love

Related News

Latest News