ప్రతిపక్షం, సెప్టెంబర్ 14: అక్కన్నపేట, మండలం మల్లంపల్లి నుంచి మోత్కులపల్లె వెళ్లే రహదారిని పోలీసులు సోమవారం మూసివేశారు. మల్లంపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కన్నపేట ఎస్సై సీహెచ్. ప్రశాంత్ ముందస్తు చర్యల్లో భాగంగా రాకపోకలను నిలిపివేశారు. గతంలో ఇదే వాగులో ఇద్దరు మృతి చెందిన ఘటనలు ఉన్నందున ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. వాగు ప్రవాహం తగ్గే వరకు ప్రజలు ఈ మార్గంలో రాకపోకలు సాగించవద్దని సూచించారు.






























