Trending Now

బీస్పీకి రెండు సీట్లు కేటాయించిన కేసీఆర్

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మరో కీలక పరిణామం.. బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తులో భాగంగా ఇరుపార్టీలు జరిపిన చర్చల అనంతరం.. రెండు సీట్లను బీఎస్పీకి కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్‌, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. వారం రోజుల క్రితమే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరగా.. సీట్ల షేరింగ్‌పై ఇవాళ క్లారిటీ ఇచ్చారు. నాగర్‌ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Spread the love