ప్రతిపక్షం, జూలై 18: హైదరాబాద్‌లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. ఓయూ కాలనీకి చెందిన కళ్యాణ్‌కు డేటింగ్ యాప్‌లో ఓ యువతి పరిచయమైంది. అనంతరం ఇద్దరూ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో కలుసుకుని మద్యం సేవించినట్లు తెలుస్తోంది.
బిల్లు తానే చెల్లిస్తానని యువతి చెప్పడంతో కళ్యాణ్ పబ్ బిల్లు చెల్లించినట్లు సమాచారం. అనంతరం ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో యువతి, మరికొందరితో కలిసి మాదాపూర్ మెట్రో స్టేషన్ కింద కళ్యాణ్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

















