తెలంగాణలో ఆషాడ మాస బోనాల సందడి!

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, ఉత్తర తెలంగాణ, జూలై 16: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాడ మాస బోనా ల మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభ మయ్యాయి, రాష్ట్ర సాంస్కృతిక వైభవా నికి ఆధ్యాత్మిక, విశ్వాసానికి అద్దం పట్టే ఈ వేడుకల ప్రారంభం సందర్భం గా నగర ప్రజలకు భక్తులకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహిం చే ఈ వేడుకలు గోల్కొండ కోటపై కొలువై ఉన్న శ్రీ జగ దాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించ డంతో ప్రారంభమై, నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా కొనసా గనున్నాయి.అమావాస్య తర్వాత వచ్చే తొలి గురువారం, ఆదివారం,రోజుల్లో గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక మహంకాళి అమ్మవా రికి తొలి బోనం సమ ర్పించడం ఆనవాయి తీ. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తులు భారీ సంఖ్యలో అమ్మ వారి దర్శనానికి తరలివస్తున్నారు. తెలంగాణ నలుమూ లల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు గోల్కొండకు చేరుకుంటున్నారు. బోనాల ప్రారంభోత్సవం లో భాగంగా నేడు లంగర్ హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. డప్పు చప్పుళ్లు, సంప్రదాయ పోతు రాజుల విన్యాసాలు, జానపద కళారూపా లతో ఈ శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

అనంతరం కోటపై జగదాంబిక మహం కాళి అమ్మవారికి కుమ్మరుల వర్గానికి చెందిన భక్తులు తొలి బోనాన్ని సమర్పించ నున్నారు. ప్రభుత్వం తరపున కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించ నున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభా కర్,లంగర్ హౌస్‌లో పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో ఆది వారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ఘనంగా బోనాలు నిర్వహించనుండగా. అనంతరం మంగళ వారం కళ్యాణోత్సవం జరుగుతుంది. మూడో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జ యిని మహంకాళి అమ్మవారి బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చివరిగా నాలుగో ఆదివారం హైదరా బాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహ వాహిని మహంకాళి అమ్మవారితో ఆషాఢ బోనాల వేడుకలు ముగియనున్నాయి.బోనాల సందర్భంగా అన్ని ఆలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలం కరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగు నీరు, వైద్య శిబిరా లు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ వంటి అన్ని ఏర్పాట్ల ను అధికారులు పూర్తి చేశారు. భద్రత దృష్ట్యా భారీ సంఖ్య లో పోలీసులను మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Spread the love

Related News

Latest News