Trending Now

మూడు సీట్లలో అభ్యర్థుల ఎంపిక పూర్తి..

రాత్రికి అధికారికంగా ప్రకటన..

ఖమ్మం‌‌ రెడ్డి, కరీంనగర్​ వెలమ, హైదరాబాద్​ ముస్లీం..?

ట్రబుల్​ షూటర్​ రంగ ప్రవేశంతో సమస్య పరిష్కారం

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: రాష్ట్రంలో మూడు సీట్లలో కాంగ్రెస్​ అభ్యర్థుల ఎంపిక అధిష్టానవర్గం నుంచి సైతం కాలేదు. దీంతో ఈ సమస్య పరిష్కారం కోసం ట్రబుల్​ షూటర్​, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్​కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే మూడు నియోజకవర్గాల్లో మూడు సామాజిక వర్గాలకు సీట్లు కేటాయించడం పూర్తి అయ్యిందంటున్నారు. తెలంగాణలో 14 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఖమ్మం, కరీంనగర్​, హైదరాబాద్​ స్థానాలను మాత్రం చాలా రోజులుగా పెండింగ్‌లోనే పెట్టేసింది. టికెట్ల కోసం పోటాపోటీగా ఉండటంతో ఎవరికి టికెట్లు ఇవ్వాలో.. ఎవర్ని పక్కనెట్టాలో తెలియక హైకమాండ్‌కు పెద్ద తలనొప్పే అయ్యింది. ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగడంతో ఈ మూడు స్థానాలపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. దీంతో ఇవాళ సాయంత్రం మూడు సీట్లకు అభ్యర్థులను ఏఐసీపీ ప్రకటించనుంది.

డీకే శివకుమార్ వ్యూహం ఫలించిందని చెప్పుకోవచ్చు. సోమవారం నాడు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో డీకే మంతనాలు జరిపారు. డీకే చెప్పడంతో భట్టి, పొంగులేటి ఇద్దరూ వెనక్కి తగ్గారు. దీంతో ఖమ్మం టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడం జరిగిందని తెలుస్తోంది. అయితే ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎవరు అనేది తెలియట్లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం.. మేరకు పొంగులేటి సోదరుడేనని తెలుస్తోంది. ఇక కరీంనగర్ టికెట్ వెలమ సామాజిక వర్గానికి కేటాయించినట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి సమీర్ ఉల్లా ఖాన్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. నేరుగా ఎలక్షన్ కమిషన్‌కి కాంగ్రెస్ పార్టీ బీ ఫారాలు పంపనున్నట్టు సమాచారం. ఈ ప్రకటన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో రాత్రి వరకు వేచిచూడాల్సిందే మరీ.

Spread the love

Related News

Latest News