ప్రతిపక్షం, జూలై 11: కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే సిద్ధిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీశ్ రావుపై పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాల్లో విజయం సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారని చెప్పారు. రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో సీఎం తీసుకునే ప్రతి నిర్ణయానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. సర్వేలను చూసి పార్టీ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు.
















