Trending Now

IPL 2024: నేడు లక్నోతో హైదరాబాద్ ‘ఢీ’..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లూ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 6 గెలిచి ఐదింట్లో ఓడిపోయాయి. ఇరు జట్ల ఖాతాలో చెరో 12 పాయింట్లు ఉన్నాయి. ఇవాళ గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో మూడు లేదా నాలుగో స్థానానికి చేరుకునే ఛాన్స్ ఉంది. నేటి మ్యాచ్ ఇరు జట్లకూ కీలకంగా మారనుంది.

మ్యాచ్‌కు వర్షం అంతరాయంపై అప్‌డేట్..

ఇవాళ ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్-లక్నో మధ్య జరిగే మ్యాచుకు వర్షం అంతరాయం కల్గించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షం పడే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని, స్వల్ప అంతరాయం తప్ప మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశమే లేదని తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల వాతావరణం చల్లగా ఉంటుందని చెప్పారు.

ఢిల్లీ గెలుపు.. రాజస్థాన్‌కు తప్పని ఓటమి

రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో RRను ఆ జట్టు చిత్తు చేసింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 201/8 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్ (86) ఒంటరి పోరాటం చేశారు. రియాన్ పరాగ్ (27), శుభమ్ దూబే (25) ఫరవాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, కుల్దీప్, ముఖేశ్ తలో 2 వికెట్లు తీశారు.

Spread the love

Related News

Latest News