Trending Now

సింథ‘ట్రిక్స్‌’కు చెక్‌.. ముఖ ఆధారిత హాజరు

హైదరాబాద్‌, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: కార్మికుల హాజరు విషయంలో సింథటిక్‌ వేలిముద్రలను ఉపయోగించి జీహెచ్‌ఎంసీ ఖజానాకు కొల్లగొడుతూ పట్టుబడుతున్న అక్రమార్కుల నుంచి బయటపడేందుకు కమీషనర్​రోనాల్డ్​రోస్​కొత్త విధానంతో హాజరు పక్రియకు శ్రీకారం చుట్టారు. జీహెచ్​ఎంసీలోని పారిశుద్ద్య విభాగంలో వేలాది మంది అవుట్ సోర్స్​కింద పనిచేయడంతో కిందిస్థాయి ఉద్యోగులు, పారిశుద్ధ్య క్షేత్రస్థాయి సహాయకులు కొంత మంది అక్రమాలకు పాల్పడుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు. ముఖ్యంగా వేలి ముద్రలతో హాజరు తీసుకోవడంవల్ల కొంత మంది సింథటిక్స్​వేలి ముద్రలు తయారు చేసి నిత్యం హాజరు వేస్తూ.. నెల నెల డబ్బులు తీసుకుంటున్నారు.

ఇలాంటి కేసులు వెలుగుచూడడంతో కొత్త విధానంలో హాజరు తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్‌1 నుంచి ముఖ ఆధారిత (ఫేస్‌ రికగ్నైజేషన్‌) హాజరును తీసుకోనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను రూపొందించారు. ఇప్పటికే ఈ విధానంపై అధికారులకు అవగాహన కల్పించారు. మొబైల్‌ యాప్‌(Mobile app)లో సర్కిళ్ల వారీగా కార్మికులు, ఎస్‌ఎఫ్ఏల వివరాలు నమోదు చేస్తున్నారు. రిజిస్ర్టేషన్‌ అనంతరం ఫేస్‌ రికగ్నైజేషన్‌ ద్వారా కార్మికుల హాజరు తీసుకుంటారు. కమిషనర్‌ రోనాల్డ్‌రోస్‌ ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Spread the love