ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రామగుండం మునిసిపల్ కార్పొరేషన్ లో 20 మంది బీఆర్ఎస్ కు చెందిన కార్పొరేటర్లు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. మేయర్ బంగి అనిల్ కుమార్ తో పాటు 20 మంది కార్పొరేటర్లకు కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.