Trending Now

కవితకు మద్దతు ప్రకటించిన మాజీ సీఎం..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కవిత అరెస్ట్‌ అంశంపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా కవితకు మద్దతు ప్రకటించారు. ‘ఓటమి భయంతోనే ప్రతిపక్ష పారీలను బీజేపీ టార్గెట్ చేసింది. ఎంత పెద్ద మొత్తంలో ప్రతిపక్షాలపై దాడి చేస్తుందో.. అంతే పెద్ద మొత్తంలో ఆ పార్టీ ఓటమిని చవిచూస్తుంది.’ అంటూ ట్వీట్ చేశారు.

Spread the love