ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను మే 24న నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ, ట్రైనింగ్ బోర్డు ప్రకటించింది. తెలంగాణ పాలిసెట్-2024 నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. 2024-25 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ నిర్వహించనున్నారు.