ప్రతిపక్షం, ఆగస్టు 24, శామీర్పేట్: మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశ్వాపూర్ గ్రామానికి చెందిన ఐలాపురం కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత గ్రామ అభివృద్ధికి తోడ్పడాలనే సంకల్పంతో ముందుకొచ్చి 30 వీధి దీపాలను అందజేశారు. గ్రామంలో మెరుగైన వెలుతురు సౌకర్యం కల్పించేందుకు ఆయన చేసిన ఈ సేవను గ్రామస్థులు అభినందించారు. ఈ సందర్భంగా గ్రామానికి వీధి దీపాలను అందించిన కిరణ్ కుమార్ రెడ్డిని 10వ వార్డు కౌన్సిలర్ మెరుపాటి గోవర్ధన్ రెడ్డి, గ్రామ పెద్దలు, స్థానికులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధికి వ్యక్తిగతంగా సహకరించడం అభినందనీయమని కౌన్సిలర్ గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రజలు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.





























