[t4b-ticker]

రజకులకు మోదీ వరం – ఉచితంగా విశ్వకర్మ వాషింగ్ మిషన్లు.

*బిజెపి మండల ఉపాధ్యక్షుడు నలపరాజు యాదగిరి

ప్రతి పక్షం చండూర్ ఆగస్టు 23: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకం పేదలకు ఆర్థికంగా వెనుకబడిన కులాలకు ఎంతో మేలు జరుగుతుందని చండూర్ మండల భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు నల్పరాజు యాదగిరి అన్నారు. చండూర్ మండలం బంగారిగడ్డ గ్రామంలో అత్యధికంగా విశ్వకర్మ యోజన పథకం అన్ని కులాలకు చెందిన వారు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఈ స్కీమును రజకులు, తాపీ మేస్త్రీలు, ఎరుకలి, టైలరు,వడ్డెరి,నాయి బ్రాహ్మణ, ఇంకా కొన్ని కులాలకు చెందినవారు అప్లై చేసుకున్నారు. ఈ స్కీము నందు ఏడు రోజుల ట్రైనింగు ఈ ట్రైనింగ్ పొందిన వారికి భోజన వసతి కల్పించి ఒక రోజుకు 400 రూపాయలు రవాణా చార్జీలు, అన్ని కులాలకు కిట్లు, కుట్టు మిషన్లు, వాషింగ్ మిషన్లు, టాపి పనిముట్లు, వడ్రంగి వాళ్లకు వాళ్ల పనిముట్లు, ఒక 15 వేలకు సంబంధించి పనిముట్లను కేంద్ర గవర్నమెంట్ ఉచితంగా ఇస్తున్నందుకు నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలిపారు. చండూర్ లో పోస్ట్ ఆఫీస్ వద్ద అన్ని కులాలకు చెందిన పనిముట్లను పంపిణీ చేసినందుకు బంగారుగడ్డ రజకుల పక్షాన నరేంద్ర మోడీ కి ధన్యవాదములు తెలిపారు. మునుముందు పేద ప్రజలకు అవసరాల కొరకు ఇలాంటి స్కీములు మరెన్నో పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.నల్పరాజు సత్తయ్య, నల్పరాజు రమేష్, నల్పరాజు కవిత, నల్పరాజు బాలకోటి, భూతరాజు శ్రీశైలం, పల్లె వెంకటేశం, కొండ్రెడ్డి వెంకన్న, నల్పరాజు మహేష్, పల్లపు రాజు, సుంకరి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News