[t4b-ticker]

కన్నతల్లిని హతమార్చిన కసాయి కొడుకు

•మద్యానికి బానిసై బలమైన ఆయుధంతో తల్లి తలపై దాడి

•అక్కడికక్కడే మృతి

•గాంధీనగర్ లో తీవ్ర కలకలం రేపిన హత్య

వనపర్తి ప్రతినిధి, ఆగస్ట్ 23(ప్రతిపక్షం): నవ మాసాలు మోసి, ప్రయోజకుడిని చేయాలని తపన పడిన తల్లినే మద్యం మత్తులో ఉన్న కుమారుడు బలమైన ఆయుధంతో తలపై దాడి చేయడంతో..అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వనపర్తి పట్టణం గాంధీనగర్ 20వ వార్డులో ఆదివారం చోటుచేసుకుంది..వివరాల్లోకి వెళితే…. 20వార్డుకు చెందిన రజియా బేగం(60) తన కుమారుడు ఆసిఫ్ తో కలిసి నివాసముంటుంది.మద్యానికి బానిసైన కుమారుడు అసిఫ్ తరచూ డబ్బుల కోసం తరుచూ తల్లితో గొడవపడేవాడు. ఆదివారం ఉదయం మద్యం మత్తులో ఉన్న కుమారుడు బలమైన ఆయుధంతో తల్లి రజియా బేగం తలపై దాడి చేశాడు.తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి అదుపులోకి తీసుకొని హత్యకు గల కారణాలు, వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న గాంధీ నగర్ లో తీవ్ర కలకలం రేపింది.

Spread the love

Related News

Latest News