[t4b-ticker]

చండూరు మున్సిపాలిటీలో వార్డు సభ – హాజరై దిశానిర్దేశం చేసిన ఆర్డీఓ శ్రీదేవి

ముసాయిదా ఓటర్ల జాబితా, SIR ప్రక్రియపై చండూరు లో కీలక సమావేశం

ముసాయిదా ఓటర్ల జాబితా, SIR పై- BLO, BLA లకు ఆర్డీవో శ్రీదేవి దిశానిర్దేశం.

పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి .

చండూరు రెవెన్యూ డివిజన్ అధికారి వందనపు శ్రీదేవి .

ప్రతి పక్షం చండూర్, ఆగస్టు 27: చండూరు మున్సిపాలిటీ పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ మరియు SIR (Special Intensive Revision) కి సంబంధించిన అంశాలపై మున్సిపల్ కార్యాలయంలో గురువారం వార్డు సభ నిర్వహించారు.ఈ వార్డు సభకు ముఖ్య అతిథిగా చండూరు ఆర్డీఓ శ్రీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా చూడాల్సిన బాధ్యత BLO లు, BLA లపై ఉందని తెలిపారు.

ముసాయిదా ఓటర్ల జాబితాలో వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్లు, డబుల్ ఎంట్రీలు, అడ్రస్ మారిన వారి వివరాలను సకాలంలో సరిచేయాలని సూచించారు. SIR ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వార్డు సభల ద్వారా ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు, సూచనలు స్వీకరించి పరిష్కరించాలని తెలిపారు. అనంతరం వార్డుల వారీగా ఓటర్ల జాబితాలో ఉన్న సమస్యలపై ఆర్డిఓ శ్రీదేవి BLO, BLA లను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ బూతరాజు దశరథ, మున్సిపల్ కమిషనర్ మల్లేశం ,కాంగ్రెస్ పార్టీ పట్టం అధ్యక్షుడు ఐతరాజు మల్లేష్ , వార్డ్ ఇంచార్జులు తో పాటు మున్సిపల్ సిబ్బంది, వివిధ వార్డుల BLO లు, BLA లు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News