Trending Now

క‌ర్నాట‌క బీజేపీ ఎంపీ క్షమాపణ చెప్పాలి..

ప్రతిపక్షం, సిద్దిపేట: రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీకి లోక్‌స‌భ‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ అందించాల‌ని క‌ర్నాట‌క బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ మండి పడ్డారు. రాజ్యాంగంలో పొందుపరిచిన, లౌకిక పదాన్ని తొలగిస్తానని గతంలో చేసిన వ్యాఖ్యలను అనంత కుమార్ హెగ్డే హిందువులకు అనుకూలంగా దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తానని, మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మన దేశ జనాభాలో 75 కంటే ఎక్కువ శాతం హిందువులే, అయినప్పటికీ ఇండియా అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుంది. హిందువులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.

ఒక పౌరుడు తన మత ప్రతిపాదికపై విచక్షణకు గురి కావడానికి రాజ్యాంగం అనుమతించదు. ఈ అంశం దృష్ట్యా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణంగా భావించవచ్చు. మళ్ళీ ఇట్టి వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపీ అనంత కుమార్ రాజ్యాంగంపై అవగాహన లేని వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాల నాయకులు ముక్తకంఠముతో ఖండించాలన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భారత పౌరులపై ఆధారపడి ఉంది. ప్రధాని మోడీ, ఈ బీజేపీ ప్రభుత్వం జాతీయవాదం పేరుతో ముసుగులో భారత రాజ్యాంగంపై ముప్పేట దాడి జరిగే అవకాశం ఉంది. మిత్రులారా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు.

Spread the love