Trending Now

అసదుద్దీన్ ఓవైసీకి అభినందనలు తెలిపిన నిర్మల్ జిల్లా ఎఐఎంఐఎం అధ్యక్షులు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 5 : ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షులు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీకి నిర్మల్ జిల్లా ఎఐఎంఐఎం అధ్యక్షులు జాబీర్ అహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్ అహ్మద్ అభినందనలు తెలిపారు. హైదరాబాద్ ఎంపీగా ఐదవ సారి ఘన విజయం సాధించిన అసదుద్దీన్ ఓవైసీ అనుక్షణం అన్ని వర్గాల సమన్యాయం, సమ సంక్షేమం కోసమే పార్లమెంట్ లో గళం విప్పి తనదైన శైలిలో మాట్లాడతారని చెప్పారు. ఉత్కంఠ భరితంగా జరిగిన హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ లు అనేక రకాల ప్రయత్నాలు చేసిన హైదరాబాద్ ఓటర్లు మాత్రం అయినా వైపే మొగ్గుచూపి 3 లక్షలకు పైగా మెజార్టీ ఇవ్వడం అభినందనీయమని చెప్పారు. భారత రాజ్యాంగ పరిరక్షణ తో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు తనదైన రీతిలో ప్రసంగించే అసదుద్దీన్ ఓవైసీ రాజకీయ మేధావులు నాయకులు దేశానికి ఎంతో అవసరమని చెప్పారు.

Spread the love

Related News

Latest News