Trending Now

గెలిచేది బీజేపీనే.. నామినేషన్ వేసిన ఈటల..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: గెలిచేది బీజేపీనే అని మల్కాజ్ గిరి లోక్ సభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మేడ్చల్ కలెక్టరేట్ లో ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. ఆయన వెంట మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి ఇంచార్జ్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కంటోన్మెంట్ బిజెపి అభ్యర్థి వంశీ తిలక్, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు భాషా, బీజేపీ రాష్ట్ర మహిళామోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి ఉన్నారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. ఇది ప్రత్యేక ఎన్నిక. ఎక్కడికిపోయిన ఈ సారి మోదీకి ఓటు వేస్తామని చెప్తున్నారు. మళ్ళీ ఆయనే ప్రధాని కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారు.

ముస్లిం మహిళలు కూడా ట్రిపుల్ తలాక్ రద్దు చేసినందుకు ఓటు వేస్తామని, ఇన్నాళ్లు మైనారిటీలను ఓట్ల కోసం వాడుకున్నారన్నారని.. మోదీ గారు మా జీవితాల్లో వెలుగు నింపారు అని చెప్తున్నారన్నారు. దొంగ సర్వేలతో పెయిడ్ ఆర్టికల్స్ తో ప్రజల అభిప్రాయాన్ని మార్చలేరు.. గెలిచేది బీజేపీనే అని ఈటల స్పష్టంచేశారు. డబ్బు సంచులతో రేవంత్ సర్కార్ వస్తుంది. ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు దీన్ని కాపాడే శక్తి ఒక్క మల్కాజిగిరి ప్రజలకు మాత్రమే ఉందన్నారు. చైతన్యానికి మారుపేరు మినీ ఇండియా మల్కాజిగిరి. మోదీ గారి తొలిశంఖారవం ఇక్కడే చేసారు. గెలిచిరండి ఏది అవసరం అయితే అది ఇస్తా అని మోదీ గారు మీకు చెప్పమని చెప్పారని తెలిపారు.

నాలుగో విడత ఎన్నికలకు గురువారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. తెలంగాణలో మే 17న 17లోక్ సభ, ఒక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ రోజు నుంచి ప్రారంభమై ఈ నెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది.

Spread the love

Related News