[t4b-ticker]

నేటి నుంచి శ్రావణ మాసం.. ఇవి చేస్తే శుభఫలితాలు!

ప్రతిపక్షం, ఆగస్టు 13: శ్రావణ మాసం ప్రారంభమైన సందర్భంగా పండితులు పలు ఆధ్యాత్మిక నియమాలను సూచిస్తున్నారు. ఈ నెలలో భక్తిశ్రద్ధలతో పూజలు, వ్రతాలు నిర్వహిస్తే శుభఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. శ్రావణ మాసం తొలి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. అనంతరం ఇంటి గుమ్మాలకు పసుపు, కుంకుమతో అలంకరణ చేసి తోరణాలు కట్టుకోవాలని పేర్కొంటున్నారు.

పూజా మందిరాన్ని శుభ్రంగా అలంకరించి గణపతి, పరమశివుడు, లక్ష్మీదేవిని భక్తితో పూజించాలని పండితులు సూచిస్తున్నారు. శివాలయాలకు వెళ్లి రుద్రాభిషేకం లేదా జలాభిషేకం చేయడం మంచిదని చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తులసి కోట వద్ద, దేవుడి గదిలో దీపం వెలిగించాలని సూచిస్తున్నారు.

శ్రావణ మాసంలో ఆహార నియమాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు. మాంసాహారానికి దూరంగా ఉండి తేలికపాటి శాకాహారాన్ని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వీలైనంత వరకు సాత్విక జీవన విధానాన్ని పాటించాలని పేర్కొంటున్నారు.

అలాగే ఈ మాసంలో అన్నదానం, వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు, దానధర్మాలు చేస్తూ శ్రావణ మాసాన్ని ఆధ్యాత్మికంగా గడపాలని సూచిస్తున్నారు.

Spread the love

Related News

Latest News