Trending Now

ల్యాప్‌టాప్‌ల దొంగ అరెస్ట్..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ల్యాప్​టాప్​ దొంగను ఎట్టకేలకు సికింద్రాబాద్​ రైల్వేష్టేషన్​లో రైల్వే పోలీసులు ఆరెస్ట్​ చేశారు. నిందితుడి నుంచి రూ.7 లక్షల విలువైన 10 ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లతో పాటు ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్‌లో వేచిచూసే ప్రయాణీకులతో పాటు.. రైలులో ప్రయాణించే వారే లక్ష్యంగా నిందితుడు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.నిత్యం ప్రయాణీకులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ల్యాప్‌టాప్‌ల దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.7 లక్షల విలువైన 10 ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లతో పాటు ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్​లో వేచిచూసే ప్రయాణీకులతో పాటు.. రైలులో ప్రయాణించే వారే లక్ష్యంగా నిందితుడు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

కర్ణాటకకు చెందిన శ్రీశైల భోసాగిగా నిందితుడిని గుర్తించారు. ఇటీవల కాలంలో ల్యాప్‌టాప్‌లు పోతున్నాయంటూ సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సాధారణ ప్రయాణీకుడిగా రైలులో ప్రయాణిస్తూ.. ప్రయాణీకుల ల్యాప్‌టాప్‌లను నిందిుతుడు చోరీ చేస్తున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. రైలు ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా చోరికి గురైతే వెంటనే సమీపంలోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

Spread the love

Related News

Latest News