Trending Now

ఘనంగా ‌నిర్మల్ మండల ప్రజా ప్రతినిధుల వీడ్కోలు సభ

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ జిల్లా నిర్మల్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సన్మాన వీడ్కోలు సభలో పాల్గొన్న నిర్మల్ మండల ఎంపీపీ కోరిపెల్లి రామేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలలో తనకు సహకారాలు అందించిన రాజకీయ నాయకులకు, అధికారులకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, వివిధ హోదాలో ఉన్న చైర్మన్లకు, తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తన వంతు సహకారంగా ఆయన ఒక సంవత్సర వేతనం 150,000 రూపాయిలు నిర్మల్ మండల గ్రామపంచాయతీ వర్కర్లకు అందించారు. గ్రామపంచాయతీ వర్కర్లతోనే గ్రామాలు మండలాలు ఎంతో అందంగా పరిశుభ్రంగా ఉన్నాయని, వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందించడానికి తాను పదవిలో ఉన్న లేకపోయినా వారికి ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారి కష్టాలను మన నాయకులు శ్రీ కూచాడి శ్రీ హరి రావు కు ఇంచార్జ్ మినిస్టర్ సీతక్క దృష్టికి తీసుకువెళ్తమన్నారు. తాను పదవిలో ఉన్నా లేకపోయినా పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ తన వంతు సహాయం అందిస్తానని అన్నారు. అనంతరం నిర్మల్ మండల ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు తన అభిమానులు, వివిధ శాఖల అధికారులు ఆయనను సన్మానించారు.

Spread the love

Related News

Latest News