Trending Now

కుల గణన చేస్తామంటూ ప్రధాని ప్రకటించాలి..

రిజర్వేషన్లు ఎత్తివేస్తే దేశాన్ని స్తంభింప చేస్తామంటూ కృష్ణయ్య హెచ్చరిక

ప్రతిపక్షం, స్టేట్​బ్యూరో: రాజ్యాంగాన్ని రద్దుచేసి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు బీజేపీ పార్టీ రద్దు చేస్తుందని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రజలలో అనేక అనుమానాలు భయాందోళనలు కలుగుతున్నాయి. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తో పాటు ఇండియా కూటమీలోని అన్ని పార్టీలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు, దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షులు నడ్డా రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు డిమాండ్​ చేశాయి. ఈ సందర్భంగా నేడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్​. కృష్ణయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్ల రద్దు అంటూ యావత్​ దేశ వ్యాప్తంగా ఉన్న బడుగు, బలహీనవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఇందుకు కాంగ్రెస్​తో పాటు పలు పార్టీలు ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కేంద్రంలో బీసీకి చెందిన వ్యక్తి ప్రధాన మంత్రిగా ఉన్నా, ఆయన పదేళ్ల పాలనలో బీసీల అభివృద్ధికి ఒక చిన్న స్కీము కూడా పెట్టలేదని ఆరోపించారు. కనీసం బీసీల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను సైతం ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు.

బడ్జెట్లో రూ. 2లక్షల కోట్లు కేటాయించమంటే, 2వేల కోట్లు కేటాయించి అవమానపరిచారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలలో తమ కూటమి అధికారంలోకి వస్తే జనగణన చేపట్టి కులగణనను చేస్తామని, జనాభాప్రాతిపాదికన విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని, చట్ట సభలలో 50% రిజర్వేషన్లు పెడతామని మేనిఫెస్టోలో పెట్టారన్నారు. , అలాగే బీహార్లో ఆర్​జేడీ ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్ లో ఓఎస్పీ పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్​ఆర్​సీపీ పార్టీ, తమిళనాడు డీఎంకే పార్టీ బీసీల అభివృద్ధికి పాటుపడతామంటూ హామీ ఇచ్చారని కృష్ణయ్య తెలిపారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీసీల గురించి పల్లెతూ హామీ కూడా ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల అభ్యున్నతి కోసం హామీలు ఇచ్చిన పార్టీలకే బీసీలంతా ఓట్లు వేయాలని, అనంతరం తమ హక్కులను సాధించుకోవాలంటూ పిలుపునిచ్చారు.

ఇప్పటికైనా బీసీల వ్యతిరేక పందా మార్చి బీసీ.ల విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ విధానాలు ప్రకటించి అభివృద్ధి చర్యలు తీసుకుంటామని బీజేపీ ఎన్నికల మేనిఫిస్టోలో ప్రకటించాలని కృష్ణయ్య ప్రధానమంత్రిని కోరారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం బీసీ వ్యతిరేకత మార్చుకోవాలని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. స్వాతంత్ర్యం వచ్చినా నేడికి కూడా ఈ దేశంలో పేద బీసీ కులాలకు అన్ని రంగాలలో సమాన వాటా లభించడం లేదన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం – బీసీలు బిచ్చగాళ్లు కాదు వాటాదారులన్నారు. వీరి వాటా ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదు. ఇదేమి న్యాయం. భరతమాత ముద్దుబిడ్డలం అందరికీ సమన్యాయం పాటించాలని కోరారు. బీసీలకు అన్యాయం చేస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. జీహైచ్​ మహిళా విభాగం కార్యదర్శిగా రాణి.. ఈ సమావేశం అనంతరం కె. ప్రణీత రాణిని గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నియమిస్తూ కృష్ణయ్య నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సమావేశంలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, అనంతయ్య, పి. సుధాకర్, రాజేందర్, నందగోపాల్, కృష్ణ మూర్తి, ప్రణీత రాణి, ఉమేశ్ యాదవ్, బలరామ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News