ప్రతిపక్షం, వెబ్ డెస్క్: టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ పలు రికార్డులు సాధించారు. టీ20ల్లో 100సార్లు 50 ప్లస్ రన్స్ చేసిన మొదటి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశారు. దీంతో పాటు ఇదే మ్యాచ్‌లో అత్యధిక క్యాచులు(173) పట్టిన భారత ప్లేయర్‌గానూ అవతరించారు. బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్ అందుకోవడంతో ఈ ఫీట్ సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో రైనా(172), రోహిత్(167) ఉన్నారు.