హుస్నాబాద్, ప్రతిపక్షం, ఏప్రిల్ 25 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కి సంబదించిన జనజాగృతి కళా సంస్థలో అంతర్భాగమైన ‘కవి సాయంత్రం’ సోషల్ మీడియా గ్రూపుకి సంబంధించిన సలహా మండలి సభ్యులను గురువారం రోజున ఎంపిక చేసినట్లు సంస్థ వ్యవస్థాపకుడు ముక్కెర సంపత్ కుమర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కమిటీలను జగ్విజయంగా పూర్తి చేసుకున్నామని అన్నారు.ఈ సందర్బంగా సలహా మండలి సభ్యులుగా అడిషనల్ కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, సినీగేయ రచయిత మౌనశ్రీ మల్లిక్, సీనియర్ అడ్వొకేట్ గులాబీల మల్లారెడ్డి, జైల్ డిఎస్పీ దార్ల కాళిదాస్, జర్నలిస్టు బోయిన భాస్కర్, విశ్రాంత ఎన్టీపిసి ఉద్యోగి ఏడెల్లి రాములు లను ఏకగ్రీవ తీర్మానంతో ఎంపిక చేసినట్లు జన జాగృతి వ్యవస్థాపకుడు సంపత్ తెలిపారు.