Trending Now

రైతులను తక్షణమే ఆదుకోవాలి..

సిద్దిపేట జిల్లా రైతుంగానికి సాగు నీళ్లు అందించాలి…
రాజకీయాలు కాకుండా రైతు ప్రయోజనాల ఫై దృష్టి సారించాలి…
రంగనాయక సాగర్ లోకి వెంటనే
1 టి ఎం సి నీటిని ఎత్తిపోయాలి…
ఆందోళన లో ఉన్న రైతుల సమస్య ను పరిష్కారించ కుంటే పోరాటానికి సిద్ధం.. రైతుల పక్షాన అండగా నిలుస్తాం:
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి లేఖ వ్రాసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట, మార్చి 10: సిద్దిపేట జిల్లా రైతంగా ప్రయోజనాల దృష్ట్యా మీకు ఈ లేఖ ద్వారా కొన్ని ముఖ్యమైన అంశాలు మీ దృష్టికి తీసుక వస్తున్నాను అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఈ సందర్బంగా ఆరుగాలం శ్రమించి వరి పంట సాగుచేస్తున్న అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రైతుల పక్షాన కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో సాగుచేస్తున్న యాసంగి పంటలు చేతికి రావాలంటే వెంటనే సాగు నీరందించాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన నాలుగేళ్లలో ముందస్తు ప్రణాళిక ప్రకారం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా సాగునీటిని అందుబాటులో ఉంచడం జరిగిందని, కానీ నేడు మీ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో అలసత్వం వహిస్తున్నట్లుగా అర్థమవుతుందన్నారు. ఓ పక్క సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. కళ్ళముందే ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు.. కొత్త బోర్లు వేయిస్తూ అప్పుల పాలవుతున్నారని, వ్యవసాయ బావులకు సంబంధించి పూడికతీత పనుల్లో రైతులు నిమగ్నమయ్యారన్నారు. ఈ దుస్థితిని అధిగమించాలంటే వెంటనే రంగనాయక సాగర్ రిజర్వాయర్ లోకి 1 టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని, గత నాలుగేళ్లపాటు ఈ సమయంలో రంగనాయక సాగర్ నిండుకుండలా నీటితో కళకళలాడింది. కానీ ప్రస్తుతం నీళ్లు లేక రిజర్వాయర్ బోసిపోయి కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి కూడా తక్షణమే నీటిని విడుదల చేయాలి. అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్ లో కూడా 1 టీఎంసీ నీటిని నిల్వ ఉంచాలని లేఖలో కోరారు. క్షేత్ర స్థాయిలో మీరు పరిశీలించి వాస్తవాలను గ్రహించాల్సిందిగా కోరుతున్నానని చెప్పారు. రాజకీయాలు కాకుండా రైతుల ప్రయోజనాలఫై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు తగిన పరిష్కారం చూపించకుంటే త్వరలోనే రైతుల పక్షాన పోరాటాలకు సైతం సిద్ధమవుతామని స్పష్టం చేసారు. రైతులకు అండగా ఉంటానని వెల్లడించారు.

Spread the love

Latest News