ప్రతిపక్షం, అక్టోబర్ 17, హుస్నాబాద్: వరంగల్ పట్టణంలో ఈరోజు నిర్వహించిన Warangal Tri-City Half Marathon – Second Editionలో హుస్నాబాద్ రన్నర్స్ బృంద సభ్యులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా 21.1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌ను పూర్తి చేశారు.
ఈ పరుగులో బత్తుల శ్రీనివాస్, బోయిని పృథ్వి, పోలు శంకర్, పంతం నవీన్ కుమార్, దొంతరవేణి సతీష్, భుక్యా తిరుపతి, రమేష్, తోట మహేష్, మహేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హుస్నాబాద్ రన్నర్స్ తమ పరుగును హుస్నాబాద్ మహిళలందరికీ అంకితం చేస్తూ, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, పరుగు, వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు.
హుస్నాబాద్ రన్నర్స్ నినాదం: డ్రగ్స్‌కు దూరంగా ఉండండి – ఆరోగ్యంగా జీవించండి!
అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు! 🌸🏃♂️





























