Trending Now

విత్తనాల దుకాణాలను తనఖీ చేసిన కలెక్టర్

ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి, నిర్మల్, జూన్ 6 : రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని, ప్రతీ రైతుకు విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని అరుణ్ ఆగ్రో ఏజెన్సీస్ విత్తనాలు, పెస్టిసైడ్స్ షాప్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, షాపు యజమానులు నిబంధనలు పాటించాలని, విత్తన నిల్వలు, ధరలు ప్రతి షాపులో ప్రదర్శించాలని సూచించారు. వానాకాలానికి అవసరమైన వివిధ రకాల విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు.

నకిలీ విత్తనాలు, అక్రమ రవాణా ను నియంత్రించేందుకు వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో తనిఖీ బృందాలను జిల్లా, మండల స్థాయిల్లో ఏర్పాటు చేయడం జరిగిందని, విత్తన, ఎరువుల దుకానములను, గోడౌన్ లను తనిఖీ చేయడం జరుగుతున్నదని తెలిపారు. వానాకాలం పంటల ప్రణాళికకు అనుగుణంగా సరిపడ ప్రత్తి, మొక్క జొన్న, సొయా, కంది, ఇతర పప్పు దినుసుల విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత లేదని, అవసరం మేరకు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి రసీదు తీసుకోవాలని అన్నారు. రోజువారీ రిపోర్టులను అందజేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News