Trending Now

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో శర్వానంద్ కొత్త సినిమా..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తన 36 వ సినిమా గురించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.. అభిలాష్ కంకర దర్శకత్వం వహించగా.. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు. విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు అనే మూడు బ్లాక్ బాస్టర్ సినిమాలు వచ్చాయి. ఈరోజు శర్వా పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుంచి ఆసక్తికర పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మురికి రహదారిపై రేసులో బైక్ రైడర్‌లను చూపుతుంది. ఈ పొస్టర్ లో రైడర్ జాకెట్‌పై S 36ని మనం చూడవచ్చు. పోస్టర్ సూచించినట్లుగా ఇది స్పోర్ట్స్ బేస్డ్ మూవీగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. ట్రెండీ ట్యూన్‌లకు పేరుగాంచిన జిబ్రాన్ సంగీతం అందింస్తున్నాడు.

Spread the love