Trending Now

అవినీతిపరులు.. అవకాశవాదులను తరిమెందుకే నామినేషన్ వేశా

నిర్మల్ పాత్రికేయుడు చావాన్ సుదర్శన్

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 25 : అవినీతిపరులు, అవకాశవాదులను ఎదుర్కొని తరిమెందుకే తాను సీనియర్ పాత్రికేయునిగా వైయస్సార్ సీపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు చావాన్ సుదర్శన్ పేర్కొన్నారు. నామినేషన్లు వేసుకునేందుకు చివరి రోజైనా గురువారం సాయంత్రం తన నామినేషన్ను దాఖలు చేసిన అనంతరం శ ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మోసపూరితమైన హామీలు పనికిరాని సంక్షేమ పథకాలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామంటూనే ప్రజలను అడుగడుగున మోసగిస్తున్న కాంగ్రెస్, బిజెపిలకు తగిన విధంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అటు కేంద్రంలో బిజెపి సంక్షేమ పథకాల పేరిట ప్రభుత్వ ఖజానాను గండికోటెల మోసగిస్తున్నాయని ఆరోపించారు. తాను గతంలో కూడా నిర్మల్ శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే స్వాతంత్ర అభ్యర్థులలో అత్యధిక ఓట్లు తనకు వేసి నిర్మల్ నియోజకవర్గం ప్రజలు అభినందించారని పేర్కొన్నారు. అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని ఏడు నియోజకవర్గాలలో రోజువారీగా తిరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వైఫల్య కార్యక్రమాలను అవగాహన కల్పిస్తూ అవకాశవాద రాజకీయ నాయకులు పార్టీలకు తగిన విధంగా గుణపాఠం చెప్పేలా ముందుకెళ్తానని చెప్పారు.

లంబాడ సామాజిక వర్గానికి చెందిన తనకు వైఎస్సార్సీపీ అధినేత ఆహ్వానం పలికి ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం మరువలేనని పార్టీ విధివిధానాలకు అనుగుణంగా ఈ ఎన్నికలలో తగిన విధంగా ముందుకెళ్లి గెలుపే లక్ష్యంగా కష్టపడతానని తెలిపారు. ఏడు నియోజకవర్గాలలోని లంబాడ సామాజిక వర్గాల వారందరూ తనకు తోడు నీడగా నిలవాలని కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ లో లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారికి కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర వర్గాలకు టికెట్లు ఇచ్చి ఎన్నికలలో పోటీకి దించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలలో తనకు పోటీ బిజెపి కాంగ్రెస్ తోనేనని ఇరుపాటిల ప్రజా వైఫల్యాల పైనే తన పోరాటం ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు సుదర్శన్,సురేష్, గణేష్ శివాజీ రాథోడ్ తదితరులు ఉన్నారు.

Spread the love

Related News