[t4b-ticker]

ఓటరు జాబితాలో మీ పేరు లేదా? డిలీట్‌కు కారణం ఇలా తెలుసుకోండి

ప్రతిపక్షం, ఆగస్టు 19: తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నేపథ్యంలో పలువురు ఓటర్లు తమ పేర్లు డ్రాఫ్ట్ జాబితాలో కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లకు ఎన్నికల సంఘం కీలక సమాచారం అందుబాటులోకి తీసుకొచ్చింది. జాబితా నుంచి తొలగించిన ఓటర్ల పేర్లతో పాటు.. వారి పేర్లు ఎందుకు తొలగించారనే కారణాలను కూడా ప్రత్యేకంగా వెల్లడించింది.

ఓటరు మరణించడం, శాశ్వతంగా నివాసం మార్చుకోవడం తదితర కారణాలతో పేర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. దీంతో డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో తమ పేరు కనిపించని వారు ముందుగా తమ పేరు తొలగింపునకు గురైందా? ఒకవేళ తొలగిస్తే అందుకు కారణం ఏమిటో తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తొలగించిన ఓటర్ల వివరాలను తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక జాబితాను విడుదల చేసింది. ఓటర్లు తమ జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, గ్రామం తదితర వివరాలను నమోదు చేసి జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవచ్చు.

మీ పేరు ఎందుకు తొలగించారో తెలుసుకోవడానికి:
ఎన్నికల సంఘం ప్రత్యేక జాబితా

ఓటరు జాబితాలో తమ పేరు లేకపోతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వివరాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పేరు తొలగింపునకు సంబంధించిన కారణాన్ని తెలుసుకున్న తర్వాత అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News