Trending Now

ఆ తీర్పుకి లోబడే ఈసీల భర్తీ : సుప్రీంలో వ్యాజ్యం

ప్రతిపక్షం, ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్ల పదవుల ఖాళీల భర్తీని సుప్రీంకోర్టు 2023 తీర్పుకు లోపడి చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ నియామకాలకు సంబంధించి పార్లమెంట్ లో చట్టం అయ్యేవరకు, ప్రధాన మంత్రి నేతృత్వంలో లోక్ సభలో విపక్షనేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన బృందం ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం గత ఏడాది తీర్పు చెప్పింది. అయితే ప్రధాని, విపక్షనేత, కేంద్ర మంత్రి సభ్యులగా గల కమిటీ ఈ నియామకాలపై కసరత్తు చేస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు జయాఠాకూర్ సుప్రీంకోర్టుల ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఒక కమిషనర్ అనూప్ చంద్రపాండే గత నెల పదవీ విరమణ చేయగా, మరో కమిషనర్ అరుణ్ గోయల్ ఇటీవల రాజీనామా చేశారు. లోక్ సభ, ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ త్వరలో విడుదల కావలసి ఉంది.

Spread the love