మునుగోడు మహిళల ఐక్యతకు మెగా బతుకమ్మే నిదర్శనం.

*మెగా బతుకమ్మను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు – కోమటిరెడ్డి లక్ష్మీ

ప్రతి పక్షం మునుగోడు అక్టోబర్ 12: ఒకే ఒక్క పిలుపుతో స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చి మునుగోడు మహిళల ఐక్యతను చాటుతూ, మునుగోడులో మెగా బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీ తెలిపారు.
ఆదివారం సాయంత్రం మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసిన మునుగోడు ఆడపడుచులకు ధన్యవాదాలు తెలిపారు.మీరు చూపించిన ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తూ ముందు ముందు మునుగోడు మహిళల చైతన్యాన్ని సమాజానికి చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.ఈ మెగా బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారి అభిమానులకు, మునుగోడు, చండూరు మండలం పట్టణం, నాంపల్లి, మర్రిగూడెం, ఘట్టుప్పల్, నారాయణ్ పూర్, చౌటుప్పల్ మండలం పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Spread the love

Related News

Latest News