Trending Now

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి కిడ్నాప్ అయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ మహ్మద్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. గత రెండు వారాలుగా ఆ విద్యార్థి కనిపించడం లేదు. మరోవైపు గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్‌లోని అబ్దుల్ మహ్మద్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.1200 డాలర్లు ఇస్తే విడిచిపెడతామని, లేదంటే కిడ్నీ అమ్మేస్తామంటూ బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓహియోలోని క్లేవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో ఇన్మర్మేషన్ టెక్నాలజీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు.

అతడు ఈనెల 7వ తేదీ నుంచి కనిపించడం లేదని అబ్దుల్ తల్లిదండ్రులు తెలిపారు. అమెరికాలోని బాధితుడి బంధువులు క్లేవ్ ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యార్థి ఆచూకీ కోసం అక్కడి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు అబ్దుల్ ఆచూకీ కనిపెట్టడంలో సహకరించాలని కోరుతూ.. బాధితుడి కుటుంబం ఈనెల 18వ తేదీన చికాగోలోని భారత కాన్సులేట్ అధికారులకు లేఖ రాసింది. మరోవైపు తనకు గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి అహ్మద్ సలీమ్ తెలిపారు. తన కుమారుడుని విడిచిపెట్టాలంటూ రూ.1200 డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని, లేకుంటే అబ్దుల్ కిడ్నీ అమ్మేస్తామంటూ బెదిరించారని సలీమ్ వెల్లడించారు. దీంతో అబ్దుల్ మహ్మద్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటన జరగడం 3 నెలల వ్యవధిలో తొమ్మిదవది. బోస్టన్‌లోని ఇంజినీరింగ్ విద్యార్థి అభిజిత్ పరుచూరు అదృశ్యమైన తరువాత అతడి మృతదేహం ఓ కారులో లభ్యమైన విషయం తెలిసిందే.

Spread the love

Related News