Trending Now

రాముడి పేరిట రాజకీయాలు చేస్తుండ్రూ..

ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 8 : పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అభివృద్ధి అడుగుతే అక్షింతలు ఇస్తూ రాముడు పేరిట రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా నిర్మల్ మండలంలోని రత్నాపూర్ కాండ్లీ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఆంగ్లేయుల పాలనలో ఉన్న భారతదేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. రాహుల్ గాంధీ త్యాగాల కుటుంబమని చెప్పారు. పదేళ్ల పాలనలో కుల పిచ్చి మత పిచ్చితో పాలన చేసి కలిసిమెలిసి ఉంటున్న మనలో వైశాల్యాలు పెంచడం బీజేపీ పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలను ఇప్పటికే అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాలకు సమన్యాయం సమసంక్షేమం జరిగి మేనిఫెస్టోను అమలు చేసి తీరుతామన్నారు.

తమకు ఏ కష్టం వచ్చినా ఇబ్బందులు ఎదురైనా తన బిడ్డగా మీ ముందుండి.. వాటిని పరిష్కారం చేస్తానని భరోసా కల్పించారు. ప్రతి ఏడాది ఒక కుటుంబం నుంచి ఒక మహిళకు లక్ష రూపాయల నగదు సాయంతో పాటు నెలసరి పెన్షన్లు ఇతరత్రా వాటిని సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందజేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాన్నారు. డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీ హరిరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని రాష్ట్రంలో ఏ మాదిరైతే పథకాలు అమలు అవుతున్నాయో కేంద్రంలో కూడా ప్రభుత్వ అదే మాదిరి ప్రజలకు ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. పదేళ్లు రాష్ట్రాలు వెళ్లిన బీఆర్ఎస్ ప్రభుత్వం కల్లీబొల్లి మాటలతో మోసగించింది తప్ప అమాయక పేద ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. ఈనెల 13న ప్రతి ఒక్కరు బాధ్యతగా చేతి గుర్తుకు ఓటు వేసి అదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆదివాసి ఆడబిడ్డ ఆత్రం సుగుణ ను గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా వేడుకున్నారు.‌ ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎంపీపీ కొరిపల్లి రామేశ్వర్ రెడ్డి, రత్నాపూర్ కాండ్లీ మాజీ సర్పంచ్ రాం రెడ్డి, మహిళా విభాగం కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి , కొట్టే శేఖర్, భీం రెడ్డి ,విలాస్, ఎంబరి గంగయ్య, భూమయ్య, సయ్యద్ సిరాజ్ ,గాజుల రవి, అరవింద్ కుమార్ కొంతం గణేష్ ,బురాజ్ తదితరులు ఉన్నారు.

Spread the love

Related News