ప్రతిపక్షం, జూలై 20: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబం చావును కోరుకోవడం తెలంగాణ సంస్కృతి కాదని అన్నారు.
గతంలో సోనియా గాంధీ కాళ్లకు నమస్కరించిన విషయాన్ని కేటీఆర్ మర్చిపోయారా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాజకీయ విమర్శలకు ఒక హద్దు ఉంటుందని, వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
మాట ఇచ్చి నిలబెట్టుకునేది గాంధీ కుటుంబమైతే.. ప్రజలను మోసం చేసేది కేసీఆర్ కుటుంబమని జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని, ఆ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజలు అంగీకరించరని పేర్కొన్నారు.
















