ప్రతిపక్షం, జూన్ 04: హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఖైతలాపూర్లో నివాసముంటున్న దంపతుల మధ్య జరిగిన కుటుంబ కలహాలు హత్యకు దారితీశాయి.
పోలీసుల వివరాల ప్రకారం, రహీం అనే వ్యక్తి తన భార్య సుమేరాతో జరిగిన గొడవ నేపథ్యంలో ఆవేశంతో ఆమెను హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.
వృత్తిరీత్యా ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న రహీంను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

















