యూజర్‌నేమ్ తెలిస్తే ఎవరైనా మెసేజ్ చేయొచ్చా?

ప్రతిపక్షం, జూలై 02: యూజర్‌నేమ్ ఫీచర్‌పై వస్తున్న సందేహాలకు వాట్సాప్ స్పష్టత ఇచ్చింది. కేవలం యూజర్‌నేమ్ తెలిసినంత మాత్రాన ఎవరైనా నేరుగా మెసేజ్ చేయలేరని, వినియోగదారుల గోప్యతకు అదనపు భద్రత కల్పించేలా కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపింది.

దీనిలో భాగంగా ‘యూజర్‌నేమ్ కీ’ అనే అదనపు భద్రతా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకున్న వినియోగదారులను సంప్రదించాలంటే యూజర్‌నేమ్‌తో పాటు ప్రత్యేక కీ కూడా తెలిసి ఉండాల్సి ఉంటుంది. అవసరమైతే యూజర్‌నేమ్, కీ రెండింటినీ మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని సంస్థ వెల్లడించింది.

అదేవిధంగా, కొత్త వ్యక్తి మొదటిసారి మెసేజ్ పంపినప్పుడు అతని వివరాలను చూపిస్తూ వినియోగదారుడికి ప్రత్యేక అలర్ట్ అందుతుందని వాట్సాప్ పేర్కొంది. ఈ కొత్త భద్రతా చర్యలతో స్పామ్ సందేశాలు, అవాంఛిత సంప్రదింపులను తగ్గించడమే లక్ష్యమని సంస్థ వెల్లడించింది.

Spread the love

Related News

Latest News