Trending Now

విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలునాయక్..

ప్రతిపక్షం, దేవరకొండ, ఏప్రిల్ 13: కొండమల్లేపల్లి మండలం చింతచెట్టుతండాలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి, దేవులసాథ్ బాపూజీ, ఆంజనేయ స్వామి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు శాలువతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జాల నరసింహారెడ్డి, డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉట్కూరి వేమన్ రెడ్డి, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News