ఎక్సైజ్​ శాఖ సూపరింటెండెంట్​ ఇంట్లో ఏసీబీ సోదాలు

ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్, జూన్ 23: నిజామాబాద్​ ఎక్సైజ్​ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో మంగళవారం ఏసీబీ అధికారుల సోదాలు కలకలం సృష్టించాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆయనపై కేసు నమోదు చేశారు. జిల్లా కేంద్రం లోని ప్రగతి నగర్ లో గల ఆయన నివాసంలో ఉదయం నుంచే ఈ సోదాలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై ఆయన ఇంట్లో తనిఖీలు చేశారు. అలాగే రాష్ట్రావ్యాప్తంగా ఆయనకు సంబంధించి వారి బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ సందర్భంగా కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నఏసీబీ అధికారులు తెలిపారు. మల్లారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. పూర్తి తనిఖీల అనంతరం ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News