Trending Now

కాంగ్రెస్​లోకి మాజీ మంత్రి అల్లోల్ల…ఈ నెల 18న ముహూర్తం

అల్లోలతోపాటు నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ఇతర జిల్లా, మండల స్థాయి ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు..

నిర్మల్ : (ప్రతిపక్షం ప్రతినిధి) : పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పార్టీకి ఒకరోజు కాంగ్రెస్ అయితే మరో రోజు బిజెపిలు షాకుల మీద శాకలిస్తూ తలనొప్పిగా మారాయి. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరుతాము పుచ్చుకో గా.. మరికంత మంది కూడా అదే మార్గాన్ని ఎంచుకొని రేపు మాకు తమకు కాంగ్రెస్ బిజెపిలో చేరే ముహూర్తాలు దగ్గర్లో ఉన్నాయంటూ పుకార్లు, షికార్లు చేస్తున్నారు. ఆ కోవా లోనే రాష్ట్ర మాజీ మంత్రి, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి తనదైన రీతిలో కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మాజీమంత్రి అల్లుళ్ల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారని ప్రచారాలు జోరు అందుకుంటుండగా మరోవైపు నియోజకవర్గంలో ఆయనను కాంగ్రెస్లో చేర్చుకో వద్దు నందు నిర్మల్ జిల్లా స్థాయి కాంగ్రెస్ శ్రేణులు రోజుకో రకమైన ఆందోళన బాటలు పట్టి తమదైన రీతిలో నిరసనలు తెలియజేస్తున్నాయి. అంతటితోనే ఆగకుండా శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి నిర్మల్ డిసిసి అధ్యక్షులకు వేరువేరుగా కాంగ్రెస్ ఆయా విభాగాల పదాధికారులు నాయకులు మాజీమంత్రి అల్లోలను ఎట్టి పరిస్థితులలోనైనా కాంగ్రెస్ లో చేర్చుకోవద్దు అంటూ వినతి పత్రాలను కూడా సమర్పించడం జరిగింది. అయితే మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం జరుగుతున్న నిరసనలు ఆందోళనలను గాలికి వదిలేసి తాను మాత్రం రంగు మారే మార్గాన్ని ఎంచుకున్నాను అన్న రీతిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర, జాతీయస్థాయి ప్రజాప్రతియులు నాయకులతో తనదైన రీతిలో రహస్య చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది **ఈ నెల 18 న కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి అల్లోల ఆయన సైన్యం.. ఏది ఏమైనా రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ముధోల్ శాసనసభ్యులు విట్టల్ రెడ్డిలతో పాటు నిర్మల్ జిల్లాకు చెందిన జిల్లా మండల నియోజకవర్గస్థాయి ప్రజా ప్రతినిధులు నాయకులు, పెద్ద ఎత్తున ఈనెల 18న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచుకునందుకు పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందించుకున్నట్లు అల్లోల వర్గీయుల ద్వారా సమాచారం. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సోదరుడు రాజా గోపాల్ రెడ్డి లు అల్లోలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు కాంగ్రెస్ అగ్రస్థాయి నాయకులతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయాన అల్లుళ్ల ఇంద్రకరణ్ రెడ్డి దగ్గర బంధువు అవడం ఆయన చేరికకు తోడుగా నిలుస్తున్నదని చెప్తున్నారు. ఈనెల 18న ఢిల్లీలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు, అదే మాదిరి ప్రియాంక గాంధీల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు నిర్మల్ లో ప్రచారాలు జోరందుకుంటున్నాయి. —-అల్లోల కాంగ్రెస్ చేరితే కారు మొత్తం ఖాళీ .. రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్కు గట్టి దెబ్బ తగిలి అవకాశాలు లేకపోలేవు. అల్లోలతో పాటు ఉన్న బీఆర్ఎస్ జిల్లా నియోజకవర్గ, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, నాయకులు, మాజీ నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లో చేరుతారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒకవేల పూర్తిస్థాయి టిఆర్ఎస్ బలగము అల్లుళ్లతో కలిసి కాంగ్రెస్ లో చేరకపోతే జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు కొంతమంది టిఆర్ఎస్ లో ఉండి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి వి సత్యనారాయణ గౌడ్, పడకంటి రమాదేవి నాతో పాటు పలువురి నేతలు వీరి అడుగుజాడలలోనే నడిచేందుకు కూడా ఇప్పటికే రహస్య సమావేశాలు కూడా జరుపుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో బీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి వి. సత్యనారాయణ గౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు మరింత సానిహీత్యంగా ఉండే నాయకులలో ఒకరుగా రాష్ట్రవ్యాప్తంగా పేరు ఉంది

Spread the love