Asia Champions Trophy.. India to the final: ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత జట్టు తన విశ్వరూపం చూపిస్తోంది. భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన ఆటతీరుతో సెమీ-ఫైనల్స్‌లో దక్షిణ కొరియాను 4-1తో ఓడించి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకుంది. లీగ్ దశలో దూకుడుగా ఆడి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్.. దక్షిణ కొరియాతో జరిగిన సెమీస్‌లోనూ సత్తాచాటింది. హర్మన్‌ప్రీత్ సేన 4-1 తేడాతో కొరియాపై విజయం సాధించింది. భారత్ తరఫున ఉత్తమ్ సింగ్ (13వ), హర్మన్‌ప్రీత్ (19వ, 45వ), జర్మన్‌ప్రీత్ సింగ్ (32వ) స్కోర్ చేశారు. కొరియా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను జిహున్ యంగ్ (33వ నిమిషం) సాధించాడు.సెప్టెంబరు 17న జరగనున్న ఫైనల్‌లో చైనాతో భారత్ తలపడనుంది.