ప్రతిపక్షం, ఏపీ: అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీ-జనసేన కూటమి దూకుడు పెంచింది. శనివారం తొలి జాబితాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి విడుదల చేశారు. 94 స్థానాలపై టీడీపీ, 24 స్థానాలపై జనసేన పోటీ చేయనున్నట్లు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. అయితే మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని అభివృద్ధి బాటలో నడిపించాలని.. రాష్ట్ర బంగార భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన అలయెన్స్ ఏర్పడిందన్నారు.
తమ పొత్తుకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయన్నారు. బీజేపీని దష్టిలో పెట్టుకుని జనసేన సీట్లను తగ్గించుకున్నామని పవన్ తెలిపారు. జనసేన కార్యాకర్తలకు అందరికి చెబుతున్నా.. టీడీపీతో పోత్తు బలంగా ఉండాలంటే స్వప్రయోజనాలన పక్కన పెట్టాలని.. మన ఓటు టీడీపీకి వెళ్లడం ఎంత ముఖ్యమో.. టీడీపీ ఓటు మనకు రావడమూ అంతే ముఖ్యమన్నారు. జగన్.. సిద్ధం.. సిద్ధం అని చావగొడుతున్నావు నీకు యుద్ధం ఇస్తాం.. అని పవన్ పేర్కొన్నారు. వైసీపీ విముక్త ఏపీ లక్ష్యంగా కలిసి పని చేస్తామన్నారు. అనంతరం పవన్ ఐదుగురు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మిగతా 19 స్థానాలకు సంబంధించి త్వరలో ప్రకటన చేస్తామన్నారు.